Lucky Movie: లక్కీ మీడియా ప్రొడక్షన్ హౌస్ నుంచి 13వ చిత్రంగా నూతన సినిమా ప్రారంభమైంది. బెక్కెం వేణుగోపాల్, బెక్కెం సబిత నిర్మిస్తున్నారు. కార్తీక్ పంపాల దర్శకునిగా పరిచయం అవుతున్నారు. బాలనటుడిగా `ఆశలపల్లెకి`లో నటించిన సన్నీ పస్తా హీరోగా పరిచయం కాబోతున్నారు. శ్రీరామనవమి శుభముహూర్తం సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ఈచిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ యాక్షన్ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు బాబీ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. లక్కీ మీడియా బేనర్ స్థాపించి 16 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా నేడు మా బేనర్లో 13వ సినిమా ప్రారంభించాం. ఇటీవలే 12వ సినిమా `అల్లూరి` చిత్రం లోగోను కూడా ఆవిష్కరించారు. ‘బూట్ కట్ బాలరాజు’ సినిమా కూడా రన్నింగ్‌లో వుంది. 13వ సినిమాగా మంచి లవ్ స్టోరీ తీయాలని అనుకున్నాం. `మేం వయస్సుకువచ్చాం` తరహాలో సినిమా చేయాలని భావించాం.
అలాంటి కథను కార్తీక్ వినిపించాడు. తను అంతకుముందు షార్ట్ ఫిలిం చేశాడు. అది చాలా బాగా నచ్చింది. అందుకే మా బేనర్లో దర్శకునిగా పరిచయం చేస్తున్నాను. అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో తను కథను చక్కగా రాసి బౌండ్ స్క్రిప్ట్‌తో వచ్చాడు. కథ ప్రకారం సన్నీ పిస్తాను లీడ్రోల్లో ఎంపిక చేశాం. తను నటనలో న్యూయార్ట్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాడు. ఈరోజు పండుగ సందర్భంగా లాంఛనంగా షూటింగ్ ప్రారంభించాం. త్వరలో చిత్రం గురించి మరిన్ని విశేషాలను తెలియజేస్తామని అన్నారు.
Also Read : దుల్కర్ సల్మాన్ చిత్రానికి ‘సీతా రామం’ టైటిల్ ఖరారు