Saturday, April 20, 2024
Homeసినిమా‘గాలివాన’ ఒక ల్యాండ్ మార్క్ సిరీస్: రాధిక

‘గాలివాన’ ఒక ల్యాండ్ మార్క్ సిరీస్: రాధిక

Gali Vana: డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన‌ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘గాలివాన’. బిబిసి స్టూడియోస్‌, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తోంది. ఇందులో సీనియర్‌ హీరోయిన్‌ రాధిక శరత్‌ కుమార్‌, హీరో సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా శరత్‌ కుమార్‌ తనదైన నటనాశైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెర పై కూడా విజయాలు అందుకున్నారు.

అయితే.. సినిమాలు, సీరియళ్లు చేసిన రాధికా శరత్‌ కుమార్‌, ఓటీటీ కోసం షో చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ వెబ్‌ సిరీస్‌తో బిబిసి రీజనల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి అడుగు పెడుతోంది అని నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ‘జీ 5’ సంస్థలు తెలిపాయి. ‘తిమ్మరుసు’ ఫేమ్‌ శరణ్‌ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్‌ సిరీస్‌కు దర్శకత్వం వహించ‌గా, సుజాత సిద్ధార్థ ఛాయాగ్రహణం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 14 న ZEE5 లో  స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్ లోని తాజ్ బంజారా లో ZEE5 యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటి రాధిక మాట్లాడుతూ “శరత్ గారు నన్ను కలిసి వెబ్‌ సిరీస్‌ కథ చెప్పడం జరిగింది. నేను ఇప్పటివరకు ఏ భాషలోనూ వెబ్‌ సిరీస్‌ చేయలేదు. కథ నచ్చడంతో ఈ గాలివాన వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను. కథ అయితే అందంగా చాలా బాగా చెప్పారు. దీన్ని ఎలా తీస్తారు అనుకున్నాను. మంచి ఫ్యామిలీ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ను దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి  చాలా బాగా డీల్ చేశాడు. ఆలాగే నేను ఒక మంచి పాత్ర చేసిందుకు గర్వంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్టులో వర్క్‌ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వెబ్ సిరీస్ చేయడం వల్ల నాకు చాలా గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సాయికుమార్ గారు కూడా అద్భుతంగా నటించారు. తనతో చాలా సినిమాలలో నటించే అవకాశం వచ్చి మిస్సయినా.. గాలివానలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

“ఇందులో నా కుతురుగా చాందిని చాలా చక్కగా నటించింది. చైతన్య, నందిని రాయ్‌, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్‌, అర్మాన్‌, శరణ్య ప్రదీప్‌ ఇలా అందరూ కూడా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ ఇలా అందరూ టెక్నీషియ‌న్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేశారు. ఇలాంటి మంచి సబ్జెక్ట్ రావడం వల్ల  ZEE5 పై వీక్షకులకు రెస్పెక్ట్  పెరుగుతుంది. తెలుగులో వస్తున్న “గాలివాన” వెబ్ సిరీస్ ఒక  ల్యాండ్ మార్క్ సిరీస్ అవుతుంది” అన్నారు.

Also Read : నాగార్జున చేతుల మీదుగా విడులైన ‘గాలివాన’’ ట్రైలర్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్