Saturday, January 18, 2025
Homeసినిమాథ్యాంక్యూ నుంచి 'మారో మారో' సాంగ్ విడుదల

థ్యాంక్యూ నుంచి ‘మారో మారో’ సాంగ్ విడుదల

Youthful Song: యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మనం లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన‌ తాజా చిత్రం థ్యాంక్యూ. సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటించారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది.

టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి మారో మారో అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. యూత్‌ఫుల్ మాస్ కాలేజ్‌గా పాటగా చిత్రంలో వుండే ఈ సాంగ్‌కు సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించగా, దీపు అండ్ ప్రదీప్ చంద్ర ఆలపించారు. ఈ క్యాచీ పాటకు విశ్వ అండ్ కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి కథను అందించారు. సినిమా జూలై 8న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయ‌నున్నారు.

Also Read : యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న ‘థ్యాంక్యూ’ టీజ‌ర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్