Wednesday, March 26, 2025
HomeTrending Newsకోమటిరెడ్డిపై.. మధు యాష్కీ ఫైర్

కోమటిరెడ్డిపై.. మధు యాష్కీ ఫైర్

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కారణమని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కి అన్నారు. పార్టీ నిర్ణయం కాదని విజయమ్మ ఏర్పాటు చేసిన సమ్మేళనంకి వెళ్ళటం పార్టీని నష్టపర్చడమే అని మధుయాష్కి మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా విజయమ్మ చేసిన వ్యాఖ్యలు కోమటిరెడ్డి సమర్ధిస్తారా అని ప్రశ్నించారు.

కోమటిరెడ్డి కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లాలని అనుకుంటే వెళ్లొచ్చని మధు యాష్కి స్పష్టం చేశారు. పార్టీ లో ఉంటూ వెన్నుపోటు పోడవద్దని, తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసే నేతలు చరిత్ర హీనులవుతారన్నారు. ఎమ్మెల్యే సీతక్క పై వ్యాఖ్యలు..సంస్కారం లేని వాళ్ళు చేసే మాటలని మధు యాష్కి ఖండించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్