Sunday, January 19, 2025
Homeసినిమాసెప్టెంబర్ 17న హాట్‌స్టార్‌లో నితిన్ ‘మాస్ట్రో’

సెప్టెంబర్ 17న హాట్‌స్టార్‌లో నితిన్ ‘మాస్ట్రో’

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో సెప్టెంబ‌ర్ 17న ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు డిస్నీహాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. హీరో నితిన్ ల్యాండ్ మార్క్ గా న‌టిస్తోన్న 30వ చిత్రమిది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను తెలియ‌జేస్తూ.. విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో హీరో నితిన్ న‌ల్ల‌టి క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి చేతిలో క‌ర్ర ప‌ట్టుకుని న‌డుస్తున్నాడు. ఇక సినిమాలో న‌టిస్తోన్న ప్ర‌ధాన తారాగ‌ణమైన న‌భా న‌టేశ్‌, త‌మ‌న్నా భాటియా, వి.కె.న‌రేశ్‌, జిస్సుసేన్ గుప్తా, త‌దిత‌రులు పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నారు.

నభా నటేశ్ ఇందులో హీరోయిన్‌గా నటించగా, త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర‌ పోషించారు.  రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్‌ సినిమాపై జ‌బ్ క్రియేట్ చేశాయి. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వై.యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డి ‘మాస్ట్రో’ చిత్రాన్ని నిర్మించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్