Language Problem: మూడేళ్ళ పాలనలో సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమంలో కొత్త ఒరవడి సృష్టించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్ ప్రశంసించారు. మూడేళ్ళలో ప్రత్యక్ష నగదు బదిలీ, నాన్ డీబీటీ ద్వారా దాదాపు రూ. 2 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి జమచేశామని వివరించారు. సిఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి నేటితో మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బూతులతో, మహానాడులో బాబు శునకానందం పొందారని, వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సామాజిక న్యాయ భేరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని శ్రీకాంత్ రెడ్డి క్షన్నారు. 14ఏళ్ళు సీఎంగా ఉండి చేయలేనిది ఇప్పుడు వచ్చి ఏం చేస్తారంటూ బాబును ప్రశ్నించారు.
శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- సంక్షేమం అంటే ఇలా ఉండాలి అని ప్రపంచానికి చూపిన ముఖ్యమంత్రి జగన్.
- మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తూ, మేనిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలు మూడేళ్ళలోనే నెరవేర్చి, మేనిఫెస్టోకు కొత్త అర్థం చెప్పారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా కులం, మతం, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఇదే.
- జగన్ పరపతి దేశవ్యాప్తంగా పెరుగుతుందని తెలిసి.. మహానాడు పేరుతో టీడీపీ నాయకులు ఒక బూతు నాడును జరిపారు.
- సంస్కారం లేకుండా, దగ్గరుండి తన పార్టీ నేతలతో చంద్రబాబు బూతులు మాట్లాడిస్తూ.. శునకానందం పొందాడు.
- ప్రభుత్వం ఏం మంచి చేసినా విమర్శించడమే టీడీపీ, జనసేన పార్టీలు పనిగా పెట్టుకున్నాయి.
- ఆ రోజు తాను అనుకుంటే, మీరు బయటకు వచ్చేవారా.. బతికి ఉండేవాళ్ళా.. అని చంద్రబాబు బెదిరిస్తున్నారు.
- మీరు అధికారంలో ఉంటే అదే చేస్తారా… అదే మేము ఆలోచన చేస్తే మీ పరిస్థితి ఏమిటో కూడా ఆలోచిస్తే బాగుంటుంది.
- ఇంకోవైపు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ప్రజల్లో తిరుగుబాటు రావాలని చంద్రబాబు పగటి కలలు కంటున్నాడు.
- ఇప్పటి వరకూ చంద్రబాబుకు ప్రజలు అధికారం అసలు ఇవ్వనట్టుగా, ఆయన అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయనట్టుగా, నన్ను గెలిపిస్తే అది చేస్తా.. ఇది చేస్తానని కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెట్టినవారు మాట్లాడినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.
- రాయలసీమ, కడప జిల్లాలను పదే పదే కించపరుస్తూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు.
- రాయలసీమకు ఒక్క మేలు చేయకుండా, అడుగడుగునా రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు.
- 30 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చి, జగనన్న కాలనీల పేరుతో ఊళ్ళకు ఊళ్ళే నిర్మిస్తుంటే.. అవి మీ కళ్ళకు కనిపించవా చంద్రబాబూ…. ? పైగా పేదలకు ఇళ్ళు కట్టించలేదని చౌక బారు విమర్శలా..?
- రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్ళి, చంద్రబాబు- జగన్ గారి నాయకత్వం మీద ప్రజల్లో ఓటింగ్ పెడితే, జగన్ గారికి 95 శాతం ఓట్లు వస్తాయి.
- చంద్రబాబుకు 5 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తాయి. దీనికి సిద్ధమా..? అదీ జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వ పటిమ.
Also Read : మరింతగా సేవ చేస్తా: జగన్ హామీ