Sunday, May 19, 2024
Homeసినిమామహేష్‌ మూవీ రిలీజ్ డేట్ సెట్ అయ్యిందా..?

మహేష్‌ మూవీ రిలీజ్ డేట్ సెట్ అయ్యిందా..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చాయి. దీంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా ఎప్పుడెప్పుడు చేస్తారా అని ఎదురుచూస్తుంటే.. ఇటీవల ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో పూజా హేగ్డేను ఎంపిక చేశారు.

ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చారు. ఆతర్వాత ఈ స్టోరీ నచ్చలేదని.. మహేష్ స్టోరీ మార్చమన్నాడని వార్తలు వచ్చాయి. అంతా సెట్ అయ్యింది కొత్తగా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు అనుకుంటే.. కృష్ణ ఆకస్మిక మరణంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో ఇప్పట్లో మహేష్ బాబు షూటింగ్ కి వెళ్లడు. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. చాలా ఆలస్యం అవుతుందని అనుకున్నారు. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మర్ లోనే ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వచ్చింది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎంత ఫాస్ట్ గా షూటింగ్ చేసినా సమ్మర్ లో రిలీజ్ చేయడం కష్టం. అందుచేత ఈ మూవీని సమ్మర్ లో కాకుండా వచ్చే సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారట. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. మరి.. మహేష్, త్రివిక్రమ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్టులు సెట్ చేస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్