మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్.. కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరూ చేస్తున్న మూడవ చిత్రమిది. 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. అందుకనే మహేష్ బాబు ఉదయం 7 గంటలకే సెట్ కి వచ్చేస్తున్నారు. 8 గంటల నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే.. ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడతారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ కి అ అనే సెంటిమెంట్ ఉంది. తన సినిమాలకు అ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేలా టైటిల్ పెడుతుంటారు. అతడు, అత్తారంటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అల.. వైకుంఠపురములో.. ఇలా అ సెంటిమెంట్ తోనే టైటిల్స పెట్టారు. తాజా చిత్రానికి రెండు టైటిల్స్ అనుకున్నారు. వాటిలో ఒకటి ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఈ రెండు టైటిల్స్ లో అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ పై త్రివిక్రమ్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. అతడే తన సైన్యం అనేది రెండో టైటిల్.
ఈ కథలో అమ్మ సెంటిమెంట్ కి ప్రాధాన్యం ఉందట. అందుకని అమ్మ అనే పేరు వచ్చేలా ఓ టైటిల్ కూడా అనుకుంటున్నారట. యూనిట్ మాత్రం అయోధ్యలో అర్జునుడు అనే పేరు బాగుందని త్రివిక్రమ్ కి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. మహేష్ తో తీసిన అతడు సినిమా బుల్లితెర మీద బాగా హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంది అంటే అలా చూస్తుండిపోతారు. ఇప్పుడు అతడు సెంటిమెంట్ రిపీట్ అవ్వాలని త్రివిక్రమ్ అనుకుంటే మాత్రం అతడే తన సైన్యం అని కూడా ఖరారు చేయొచ్చు. ఉగాదికి టైటిల్ ప్రకటించి, ఫస్ట్ లుక్ విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరి.. ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో..?