Sunday, January 19, 2025
Homeసినిమాసర్కారు వారి సరికొత్త సమాచారం

సర్కారు వారి సరికొత్త సమాచారం

సూపర్ స్టార్ మహేష్ బాబు – ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేష్ సరసన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తుంది. దుబాయ్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా తాజా షెడ్యూల్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు కరోనా తగ్గడంతో షూటింగ్ లు స్టార్ట్ అయ్యాయి. మహేష్‌ కూడా షూటింగ్ లో పాల్గోనేందుకు ఓకే చెప్పాడని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఈ నెల 15న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా విషయంలో మహేష్ బాబు టార్గెట్ ఫిక్స్ చేశారని తెలిసింది. ఏంటంటే.. ఈ మూవీ షూటింగ్‌ను సెప్టెంబరు కల్లా పూర్తి చేయాలని చిత్రయూనిట్ కి చెప్పారట. బ్యాంకింగ్ లో జరిగే ఆర్థిక నేరాలు నేపధ్యంతో ఈ  సినిమా రూపొందుతోంది. ఈ క్రేజీ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయనున్నారు. అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా కంప్లీట్ చేసి ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటారు మహేష్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్