Sunday, January 19, 2025
Homeసినిమాఈ రెండు సినిమాలపై మ‌హేష్ ఉత్సుకత

ఈ రెండు సినిమాలపై మ‌హేష్ ఉత్సుకత

‘భ‌ర‌త్ అనే నేను’, ‘మ‌హ‌ర్షి’, ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’, ‘స‌ర్కారు వారి పాట‌’.. ఇలా వ‌రుస‌గా స‌క్సెస్  లు సాధిస్తున్న మ‌హేష్ బాబు….మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తో తన తర్వాతి సినిమాలు చేస్తున్నారు.  వీటి అప్ డేట్స్ కోసం అభిమానులు ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.  మహేష్ బాబు ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తన సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

“త్రివిక్ర‌మ్ తో నేను చేసిన అత‌డు, ఖ‌లేజా చిత్రాల‌కు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆడియ‌న్స్ థ్రిల్ క‌లిగించేలా ఉంటుంది” అన్నారు.  “రాజమౌళితో సినిమా అంటే ఒకేసారి 25 చిత్రాలకు పని చేయడం లాంటిది. ఇందులో  నా పాత్ర శారీరక శ్రమతో కూడుకున్నద”ని మహేష్ తెలిపారు. అలాగే ఇది పాన్ ఇండియా మూవీ అని సూపర్ స్టార్ ధృవీకరించారు. ఈ సినిమా గురించి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని చెప్పారు.

త్రివిక్ర‌మ్ తో చేయ‌నున్న మూవీని ఆగ‌ష్టు 15 నుంచి స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని వ‌చ్చే సంవ‌త్స‌రం స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాల‌నేది ప్లాన్. ఇక రాజ‌మౌళితో చేయ‌నున్న మూవీని జ‌న‌వ‌రిలో ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. మ‌రి.. వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న మ‌హేష్ బాబు ఈ రెండు చిత్రాల‌తో ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read : మ‌ళ్లీ వెండితెరపైకి ‘పోకిరి’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్