Sunday, January 19, 2025
HomeసినిమాPawan Kalyan, Mahesh Babu: పవన్, మహేష్ అభిమానులకు పండగే

Pawan Kalyan, Mahesh Babu: పవన్, మహేష్ అభిమానులకు పండగే

మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్ ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. వీరమల్లు, ‘ఓజీ’, ‘వినోదయ సీతం’ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ నాలుగు సినిమాలను సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాలని గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేయాలని హరీష్ శంకర్ ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్నాడు. ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ అయి ఆకట్టుకోగా ఫస్ట్ గ్లింప్స్ ని మే 11న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పై అభిమానులతో పాటు ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది.

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది కానీ.. అలాంటిది ఏమీ లేదని… టీజర్ ను మే 31న విడుదల చేస్తున్నామని నిర్మాత ప్రకటించారు. దీనికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మే 11న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ అయితే.. మే 31న మహేష్ బాబు మూవీ గ్లింప్స్ రిలీజ్ కానున్నాయి. ఈ విధంగా పవర్ స్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మే నెలలో పండగే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్