Sunday, January 19, 2025
Homeసినిమాఆగష్టు 11న రసవత్తరమైన పోటీ

ఆగష్టు 11న రసవత్తరమైన పోటీ

సంక్రాంతి సీజన్ అయిపోయింది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కోసం మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే సమ్మర్ లో రిలీజ్ చేయడానికి డేట్స్ లాక్ చేస్తున్నారు. అందుచేత సంక్రాంతి వలే సమ్మర్లో సినిమాల మధ్య మంచి పోటీఏర్పడింది. అయితే.. సమ్మర్ తర్వాత ఆగష్టు 11న రిలీజ్ చేసేందుకు మూడు భారీ చిత్రాలు పోటీపడడడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. ఆగష్టు 11న వచ్చే ఆ భారీ చిత్రాలు ఏంటంటే… మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ఇటీవల తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసిన మహేష్‌ మూవీని ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టుగా నిర్మాత ఓ ఇంటర్ వ్యూలో ప్రకటించారు. మరో వైపు రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయాలి అనుకున్నారు. ఈ మూవీలో రజనీకాంత్ కు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తుంది. సునీల్ జైలర్ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీని కూడా ఆగష్టు 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని సుదీర్ఘ సెలవులను లక్ష్యంగా చేసుకున్నారు.

ఇండిపెండెన్స్ డే సోమవారం రావడంతో పెద్ద వీకెండ్ ఆ వారం సినిమాలకు దక్కనుంది. వీళిద్దరితోనే కథ అయిపోలేదు. అర్జున్ రెడ్డి తర్వాత దాని హిందీ రీమేక్ తప్ప ఇంకో మూవీ చేయని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రణ్ భీర్ కపూర్ తో తీస్తున్న ‘యానిమల్’ సైతం అదే తేదీని గతంలోనే లాక్ చేసుకుంది. ఇప్పటి దాకా ఇండియన్ స్క్రీన్ మీద రాని హీరో ఆటిట్యూడ్ ని ఇందులో చూస్తారనే టాక్ ఉంది. ఈ ట్రయాంగిల్ వార్ చాలా రసవత్తరంగా ఉండనుంది. ఎందుకంటే మూడు ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. మరి.. ఈ రసవత్తరమైన పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్