Sunday, January 19, 2025
HomeసినిమాSSMB28: మహేష్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

SSMB28: మహేష్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అతడు, ఖలేజా చిత్రాలు రూపొందాయి. ఈ రెండు చిత్రాలు వెండితెర కంటే బుల్లితెర పై బాగా సక్సెస్ అయ్యాయి. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ ఫిల్మ్ చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అది ఇప్పటికి సెట్ అయ్యింది. ఈ క్రేజీ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో మహేష్ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. దీనికి సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మహేష్‌ కు అమ్మ క్యారెక్టర్ ఉంది. ఆ పాత్రను సీనియర్ హీరోయిన్ శోభనతో చేయించనున్నారని వార్తలు వచ్చాయి. ఆమెను కాంటాక్ట్ చేశారు కానీ.. ఎందుకనో అంతగా ఆసక్తి చూపించలేదని తెలిసింది. ఆతర్వాత ఆ పాత్రను రమ్యకృష్ణతో చేయించనున్నారని… ఆమె ఇందులో నటించేందుకు ఒప్పుకుందని టాక్ వినిపించింది. తాజాగా ఈ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ సీనియర్ నటి రేఖను కాంటాక్ట్ చేయనున్నారని తెలిసింది. ఒకవేళ రేఖ నో అంటే.. అప్పుడు సీనియర్ హీరోయిన్ విజయశాంతితో చేయించాలి అనుకుంటున్నారట.

ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల పై మేకర్స్ స్పందించలేదు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. ప్రచారంలో ఉన్న వార్తల పై క్లారిటీ ఇస్తుంటారు కానీ.. గత కొంతకాలంగా ఈ మూవీలో అమ్మ పాత్ర పోషించేది ఎవరు అనే వార్తల పై స్పందించకపోవడంతో ఇది నిజమే అనిపిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్