Tuesday, January 21, 2025
HomeసినిమాMahesh Babu: చిరు డైరెక్టర్ తో మహేష్‌ మూవీ..?

Mahesh Babu: చిరు డైరెక్టర్ తో మహేష్‌ మూవీ..?

మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో మహేష్ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఇయర్ ఎండింగ్ లో స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు.

అయితే.. ఇప్పుడు మహేష్ తో మూవీ చేసేందుకు వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ సాధించిన డైరెక్టర్ బాబీ ప్రయత్నిస్తున్నారు. బాబీ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఆతర్వాత బాబీ ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు కానీ.. ఇటీవల మహేష్‌ కి కథ చెప్పాడని తెలిసింది. ఆ కథ మహేష్ కి నచ్చడంతో  ఒకే చెప్పాడని టాక్. దీంతో బాబీ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి పనిలో పడినట్లు సమాచారం. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి చిరును అభిమానులు కోరుకున్నట్టుగా చూపించిన బాబీ మహేష్‌ ని ఎలా చూపించనున్నారా..? అనేది ఆసక్తిగా మారింది.

మహేష్‌ బాబు చేస్తున్న మూవీ ఆగిపోయిందని ప్రచారం జరిగింది కానీ.. అలాంటివి నమ్మద్దు. మే 31న టీజర్ వస్తుంది. సంక్రాంతికి సినిమా వస్తుందని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో మూవీ స్టార్ట్ చేస్తారు. ఇది పాన్ వరల్డ్ మూవీ. విజయేంద్రప్రసాద్ ఆల్రెడీ స్టోరీ రెడీ చేశారు. ఆయనతో సినిమా అంటే తక్కువులో తక్కువ రెండేళ్లు పడుతుంది. అది పూర్తైన తర్వాత బాబీతో మూవీ అంటే.. చాలా టైమ్ పట్టచ్చు. మరి.. ఈలోపు బాబీ వేరే హీరోతో సినిమా చేస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్