Saturday, January 18, 2025
Homeసినిమాసాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా మ‌హేష్‌?

సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా మ‌హేష్‌?

మ‌హేష్ బాబు,  త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు రూపొంది స‌క్సెస్ సాధించాయి. వెండితెరపై క‌న్నా బుల్లితెరపై ఈ సినిమాలు బాగా స‌క్సెస్ అయ్యాయి. వీరిద్ద‌రూ క‌లిసి చేస్తున్న మూడ‌వ సినిమా ఇటీవ‌ల సెట్స్ పైకి వ‌చ్చింది. దీంతో అభిమానులు ఈ సినిమాలో మ‌హేష్ క్యారెక్ట‌ర్ ఎలా ఉండబోతుంది..? అస‌లు క‌థ ఏంటి..?  ఏ జోన‌ర్ మూవీ..? ఇలా అనేక విష‌యాల గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు.

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఇందులో మ‌హేష్ బాబు సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా న‌టిస్తున్నార‌ట‌. ఈ క్యారెక్ట‌ర్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుందట‌. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ చేసిన సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంద‌ట‌. ఇంకా చెప్పాలంటే… స‌రికొత్త యాక్ష‌న్ ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నార‌ని తెలిసింది. ఇందులో పొలిటిక‌ల్ ట‌చ్ కూడా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది.

తాజా షెడ్యూల్ ను ఈ నెల 15 నుంచి స్టార్ట్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్ లో మ‌హేష్ బాబు పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాల‌నేది ప్లాన్. ఎందుచేత‌నంటే.. ఈ మూవీ పూర్తి చేసి రాజ‌మౌళితో సినిమా స్టార్ట్ చేయాలి. అందుక‌నే త్రివిక్ర‌మ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. స‌మ్మ‌ర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్