Sunday, January 19, 2025
Homeసినిమామహేష్‌ మూవీ టైటిల్ ఏంటి..?

మహేష్‌ మూవీ టైటిల్ ఏంటి..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్నిహారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని ఓ ఇంటి సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. ముందుగా యాక్షన్ మూవీ చేయాలి అనుకున్నప్పటికీ.. ఆతర్వాత ఫ్యామిలీ స్టోరీ చేయాలనే ఫిక్స్ అయ్యారు.

అయితే.. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయకపోవడంతో ‘ఎస్ఎస్ఎంబి 28’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పుడు ‘ఆరంభం’ అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ టైటిల్స్ అతడు, అత్తాంరిటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అల.. వైకుంఠపురములో.. ఇలా అ అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. అందుచేత ప్రచారంలో ఉన్న ఆరంభం అనే టైటిల్ నిజమే అనుకున్నారు. అయితే.. ఇప్పుడు మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.

అభిమానులందరికీ ఒక సర్ప్రైజ్ ఇచ్చే విధంగా మార్చి 22వ తేదీన గట్టిగా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఆరోజు ఉగాది కావడంతో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా టైటిల్ సహా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీకి చస్తే.. అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రచారంలో ఉన్న ఈ టైటిల్ చూసి ఇదేం టైటిల్ రా బాబు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి టైటిల్ పెట్టరనే అనుకుంటున్నారు సినీజనాలు. మరి.. త్రివిక్రమ్ ఏ టైటిల్ పెడతారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్