Sunday, January 19, 2025
HomeసినిమాMahesh Babu: ప్రభాస్ వెర్సెస్ మహేష్‌

Mahesh Babu: ప్రభాస్ వెర్సెస్ మహేష్‌

Prabhas: ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా రూపొందిన మూవీ ప్రభాస్ రాముడుగా నటిస్తుంటే..కృతిసనన్ సీతగా నటిస్తుంది. సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటిస్తున్నాడు. ఈ మూవీని జూన్ 16న విడుదల చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ నుంచి సలార్ మూవీ విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’ మూవీలో ప్రభాస్ కు జంటగా శృతి హాసన్ నటిస్తుంది.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న మూవీ కావడంతో సలార్ పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జవవరి 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

ఇప్పుడు ప్రభాస్ కు పోటీగా మహేష్‌ బాబు మూవీ వస్తుంది. మహేష్‌.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే.. ఒక రోజు గ్యాప్ లో ప్రభాస్ ప్రాజెక్ట్ కే, మహేష్, త్రివిక్రమ్ మూవీ విడుదల కానున్నాయి. దీంతో రానున్న సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర రసవత్తరమైన పోటీ ఏర్పడింది. మరి.. ప్రభాస్, మహేష్‌ ఈ ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్