Saturday, January 18, 2025
Homeసినిమామహేష్‌ కథకి పాన్ ఇండియా కష్టాలు

మహేష్‌ కథకి పాన్ ఇండియా కష్టాలు

మహేష్‌ బాబు,  త్రివిక్రమ్.. కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు రూపొందాయి. చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మూడవ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఈ క్రేజీ, భారీ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సరసన పూజా హేగ్డే నటిస్తున్న ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ చాలా ఫాస్ట్ గాకంప్లీట్ అయ్యింది. దీంతో ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

మేటర్ ఏంటంటే… ఫస్ట్ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ మాత్రమే తీసారు. కారణం ఏంటంటే.. ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి పాన్ ఇండియా మూవీగా తీయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. త్రివిక్రమ్ మాత్రం తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ రాశారట. ఇప్పుడు ఈ కథను పాన్ ఇండియా స్టోరీగా మార్చాలంటే ఏం చేయాలనే ఆలోచనలో పడ్డానట. అందుకనే ఫస్ట్ షెడ్యూల్ ను చాలా తక్కువ రోజులు మాత్రమే చేశారని.. మహేష్‌ బాబు కథలో మార్పులు చేర్పులు చెప్పారని వార్తలు వచ్చాయి. నిర్మాణ సంస్థ మాత్రం కథలో మార్పులు చేర్పులు అలాంటివి ఏమీ లేవు.

ఫస్ట్ షెడ్యూల్ అనుకున్నట్టుగానే జరిగింది. మహేష్ గారు విదేశాలను నుంచి వచ్చారు. వెంటనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని సోషల్ మీడియాలో ప్రకటించారు నిర్మాత. ఇలా ప్రకటించినప్పటికీ.. క‌థ విష‌యంలో త్రివిక్ర‌మ్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాడట. మ‌హేష్ బాబుతో సినిమా విష‌యంలో ఓ అడుగు ముందుకు ప‌డుతుంటే, ప‌ది అడుగులు వెన‌క్కి లాగుతుండ‌డం… మహేష్‌ అభిమానుల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన క‌థ ఇంత వ‌ర‌కూ సెట్ కాక‌పోవ‌డం వెనుక పాన్ ఇండియా స్ట్రాట‌జీనే ప్ర‌ధాన‌మైన కార‌ణం అంటూ వార్తలు వస్తుండడంతో ప్రచారంలో ఉన్న వార్త నిజమేనేమో అనిపిస్తుంది. మరి.. మహేష్ స్పందిస్తాడేమో చూడాలి.

Also Read : సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్