Saturday, January 18, 2025
Homeసినిమామ‌హేష్‌ భారీగా పెంచేశారా?

మ‌హేష్‌ భారీగా పెంచేశారా?

Heavy: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భ‌రత్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు, స‌ర్కారు వారి పాట‌.. ఇలా వ‌రుస‌గా సక్సెస్ సాధిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నారు. ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ బ‌డ్జెట్ కేటాయించార‌ట మేక‌ర్స్. ఒక‌ప్పుడు 100 కోట్లతో సినిమా అంటే.. తెలుగు సినిమా బ‌డ్జెట్ 100 కోట్లా అనుకునేవారు. ఇప్పుడు 100 కోట్లు అనేది కామ‌న్ అయ్యింది.

దీనికి త‌గ్గ‌ట్టుగానే హీరోల రెమ్యూన‌రేష‌న్స్ కూడా భారీగా పెరిగాయి. ఇప్పుడు కొంత మంది హీరోలు వంద కోట్లు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ పారితోషికం ఎప్పుడో వంద కోట్లు దాటేసింది. ఇప్పుడు మహేష్‌ బాబు కూడా వంద కోట్ల‌కు ద‌గ్గ‌ర‌లో  ఉన్నారని టాక్. టాలీవుడ్‌లోని స్టార్‌ హీరోల్లో మహేష్‌ ఒకరు. నిన్నా మొన్నటి వరకూ ఆయన పారితోషికం 50 కోట్లే. సర్కారు వారి పాట కోసం 55 కోట్లు అందుకొన్నారని తెలిసింది.

ఇప్పుడు ఏకంగా 20 కోట్లు పెంచార‌ట‌. అంటే మ‌హేష్ రెమ్యూన‌రేషన్ 75 కోట్లు డిమాండ్‌ చేస్తున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. మహేష్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్‌75 కోట్లు అందుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్‌ సైతం ఈ సినిమాకి 25 కోట్ల పారితోషికం అందుకొంటున్నారని తెలుస్తోంది. ఈ లెక్క‌న మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ ఇద్ద‌రి కలిపే వంద కోట్లు. ఇది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్