Sunday, January 19, 2025
Homeసినిమా కృష్ణ బ‌యోపిక్ గురించి మ‌హేష్ ఏమ‌న్నారంటే.....

 కృష్ణ బ‌యోపిక్ గురించి మ‌హేష్ ఏమ‌న్నారంటే…..

Super biopic:  సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరో వైపు నిర్మాత‌గా సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. GMB ఎంటర్ టైన్మెంట్ పేరుతో పలు చిత్రాలు నిర్మిస్తున్న మహేష్ తాజాగా మేజర్ అనే సినిమాను నిర్మించారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ లో మహేష్.. త‌న తండ్రి కృష్ణ బయోపిక్ గురించి చేసిన‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. మ‌హేష్ బాబుని ఉద్దేశించి.. మిమ్మ‌ల్ని దేవుడుగా భావించే అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమానం మీకు సొంతం.. మరి అలాంటి అభిమానులకు కృష్ణ గారి బయోపిక్ ఎప్పుడు అందిస్తారు అని మ‌హేష్ ని అడిగాడు రిపోర్ట‌ర్.

దీనికి మహేష్ సమాధానమిస్తూ.. కృష్ణ గారి బయోపిక్ ఎవరైనా తీస్తే మొదటగా నేను చూసి సంతోషిస్తాను కానీ.. నేను నాన్న బయోపిక్ తీయను. ఆయన నా దేవుడు.. అవసరం అయితే.. నాన్న బ‌యోపిక్ ను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి. మ‌రి.. కృష్ణ బ‌యోపిక్ ను ఎవ‌రు ప్లాన్ చేస్తారో.. ఎవ‌రు డైరెక్ట్ చేస్తారో.. చూడాలి.

Also Read : రాజ్‌నాథ్ సింగ్‌కి ‘మేజర్’ ట్రైలర్‌ ప్రదర్శన

RELATED ARTICLES

Most Popular

న్యూస్