Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్‌, రాజ‌మౌళి మూవీ ముహుర్తం ఫిక్స్?

మ‌హేష్‌, రాజ‌మౌళి మూవీ ముహుర్తం ఫిక్స్?

మ‌హేష్ బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై డా.కె.ఎల్.నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీగా  ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ మూవీ కోసం స్టోరీ రెడీ చేస్తున్నారు.

అయితే.. ఈ ప్రాజెక్ట్ ను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ‌తారు అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు అంతా సెట్ అయ్యింద‌ని తెలిసింది. ముహుర్తం డేట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఎప్పుడంటే… 2023లో జనవరి 26న గ్రాండ్ గా ఈ మూవీని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వ‌ర్క్ జరుగుతుంది. జనవరి వరకు స్క్రిప్ట్ వర్క్ ని పూరి చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. సౌత్ ఆఫ్రికా రైట‌ర్ విల్బర్ స్మిత్ నవలల స్ఫూర్తితో మహేష్ మూవీని రాజమౌళి తెరకెక్కించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: మ‌హేష్‌, జ‌క్క‌న్న మూవీలో ర‌ణ్ భీర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్