-0.2 C
New York
Wednesday, November 29, 2023

Buy now

Homeసినిమాగ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో రెజీనా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో రెజీనా

రాజ్య సభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా హీరోయిన్ రెజీనా మొక్కలు నాటారు. మరో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి శిల్పరామం రాక్ పార్క్ ఆవరణలో రెజీనా తో పాటు ‘షాకిని డాకిని’ సినిమా ప్రొడ్యూసర్ సునీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెజినా– సునీత మాట్లాడుతూ ఇంతటి గొప్ప గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలో పచ్చదనం పెరగాలని ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టి అందరిలో స్ఫూర్తిని నింపుతున్నారని కొనియాడారు.  ఈ ఛాలెంజ్ లో అందరూ భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉందన్చానారు.  తమకు ఎంతో ఇష్టమయిన పారిజాతం, వేప మొక్కలను నాటడం మనసుకు మరింత ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఒక చైన్ లా కొనసాగుతున్న గ్రీన్ఇండియా చాలెంజ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని రేపటి తరాలకు మంచి ఆక్సిజన్ అందేలా చూడాలన్నారు.

అనంతరం ఈ ఛాలెంజ్ లో భాగంగా  మొక్కలు నాటాలంటూ నివేదా థామస్ కు  రెజీనా…..  శ్రీ సింహ, కాల బైరవలకు సునీత ఛాలెంజ్ విసిరారు.

Also Read గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నిఖత్ జరీన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్