Sunday, January 19, 2025
Homeసినిమామహేష్‌ - రాజమౌళి మూవీ ప్లాన్ ఇదే

మహేష్‌ – రాజమౌళి మూవీ ప్లాన్ ఇదే

సూపర్ స్టార్ మహేష్‌ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతికి సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇక అక్టోబర్ నుంచి మహేష్.. త్రివిక్రమ్ తో చేయనున్న సినిమాను స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటించనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సినిమా తర్వాత మహేష్‌.. రాజమౌళి సినిమానే చేయనున్నారా..? లేక మరో సినిమా చేయనున్నారా…? అంటే.. రాజమౌళితో సినిమా చేయడానికే ఓకే చెప్పినట్టు సమాచారం.

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు. ఈ భారీ క్రేజీ మూవీని దుర్గా ఆర్ట్స్ అధినేత డా.కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం పాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్ స్టోరీ రెడీ చేస్తున్నారు. 2022 సమ్మర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే.. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అనుకున్న ప్రకారం.. ఎలాంటి అడ్డంకులు రాకుండా అక్టోబర్ 13న రిలీజ్ అవ్వాలి. అలాగే మహేష్ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా కూడా అనుకున్నట్టుగా ఆరు లేదా ఏడు నెలల్లో పూర్తి అవ్వాలి.

ఇలా మహేష్ ‘సర్కారు వారి పాట’, త్రివిక్రమ్ తో చేయనున్న సినిమా, రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్..అంతా అనుకున్నట్టు జరిగితే.. 2022 సమ్మర్ నుంచి మహేష్ – రాజమౌళి మూవీ స్టార్ట్ అవుతుంది. లేక వీటిలో ఏమాత్రం మార్పు వచ్చినా మహేష్‌ – రాజమౌళి మూవీ మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్