Mahesh-Vanga: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో భారీ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రాన్ని జనవరిలో స్టార్ట్ చేయనున్నారు. గతంలో వలే కాకుండా ఈ చిత్రాన్ని సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేది రాజమౌళి ప్లాన్.
అయితే.. ఈ సినిమా తర్వాత మహేష్ చిత్రం ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. రీసెంట్ గా మహేష్, సుకుమార్ కాంబినేషన్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చాయి. మహేష్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 1 నేనొక్కడినే చిత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేకపోయినా.. టెక్నికల్ గా సూపర్ మూవీ అనిపించుకుంది. దీంతో సుకుమార్ తో మళ్లీ వర్క్ చేయాలి అనుకున్నారు. ఇప్పుడు ఫిక్స్ అయ్యింది అంటున్నారు.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగతో కూడా మహేష్ బాబు సినిమా చేయనున్నాడట. అర్జున్ రెడ్డి తర్వాతే మహేష్ తో సినిమా చేయాలి. చాన్నాళ్లు కథాచర్చలు జరిగాయి కానీ సెట్ కాలేదు. ఆతర్వాత బాలీవుడ్ మూవీ చేయడం జరిగింది. ఇప్పుడు మహేష్ తో మూవీ ఫిక్స్ అయ్యిందట. అయితే.. రాజమౌళితో సినిమా తర్వాత మహేష్ సుకుమార్ తో సినిమా చేస్తారట. ఆతర్వాత సందీప్ రెడ్డితో మహేష్ మూవీ ఉంటుందని టాక్.