Tuesday, September 24, 2024
Homeసినిమామహేష్ ఫస్ట్ టైమ్ అలా చేస్తున్నాడా?

మహేష్ ఫస్ట్ టైమ్ అలా చేస్తున్నాడా?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్ కు జంటగా క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల సెకండ్ హీరోయిన్. కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ టబు నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా కన్ ఫర్మ్ కాలేదని సమాచారం. ఈ భారీ, క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ మూవీ తాజా షెడ్యూల్ జనవరి నుంచి స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అయ్యింది. ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళితో సినిమా చేయాల్సివుంది. అందుచేత ఈ మూవీని చాలా ఫాస్ట్ గా చేయాలి అనుకుంటున్నారు మేకర్స్. జనవరి సెకండ్ వీక్ లో స్టార్ట్ అయ్యే ఈ మూవీ షూటింగ్ ను సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. ఇందుకోసం పక్కా ప్లాన్ రెడీ చేశారని.. జనవరి సెకండ్ వీక్ నుంచి మార్చి నెలాఖరు వరకు జరిగే షూటింగ్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని వార్తలు వస్తున్నాయి.

బహుశా మహేష్ ఇలా కంటిన్యూగా ఇంత లెంగ్తీ షెడ్యూలు చేయడం ఇదే తొలిసారి కావచ్చు. జనవరి రెండోవారం నుంచి మార్చి చివరి వరకు అంటే దాదాపు 80 రోజులు. వీటిలో చిన్న చిన్న బ్రేక్స్, ఆదివారాలు వదిలేసినా 60 రోజులు కంటిన్యూ షూట్ వస్తుంది. ఈ మూవీకి రామ్ లక్ష్మణ్ లు ఫైట్ మాస్టర్లు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్