సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన అతడు, ఖలేజా… ఇద్దరికీ మంచి పేరు తీసుకు వచ్చాయి. మరోసారి వీరి కలయికలో రాబోతోన్న కొత్త సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అప్పటి నుంచి అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు ఐటీ మినిస్టర్ గా కనిపించనున్నాడని.. ఇదొక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమా కాదా అని ఆరా తీయడం స్టార్ట్ చేసారు సినీ జనాలు. ఈ విషయమై ఆరా తీస్తే ఇది ఒట్టి పుకారేనని.. ఏమాత్రం వాస్తవం లేదని తెలిసింది.
మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసేది కమర్షియల్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. మహేష్ కోసం త్రివిక్రమ్ ఒక బ్యూటీఫుల్ స్టోరీ రెడీ చేసాడు కానీ అందులో రాజకీయ నేపథ్యం ఉండదు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ మాత్రం ఉంటుంది. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు త్రివిక్రమ్. ఈ సినిమా ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్తుందని.. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.