Thursday, March 12, 2026
Homeసినిమామ‌హేష్ బాబు, త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ ప్రారంభం

మ‌హేష్ బాబు, త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ ప్రారంభం

Hat-trick movie launched: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో, శ్రీమతి మమత సమర్పణలో టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న భారీ, ప్రతిష్టాత్మక చిత్రం నేడు ప్రారంభమైంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఉదయం 9 గంటల 53 నిమిషాలకు చిత్రం పూజాకార్యక్రమాలతో, ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా జరిగింది.

చిత్ర కథానాయిక పూజ హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రత శిరోద్కర్ క్లాప్ నిచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన పూజాహెగ్డే మరోసారి జతకడుతున్నారు.

మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు`, `ఖ‌లేజా` దశాబ్ద కాలానికి పైగా నేటికీ ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ నేడు ప్రారంభమైందన్న న్యూస్ ఇటు ప్రేక్షకుల్లో, అటు అభిమానుల ఆనందాన్ని అంబరాన్ని తాకేలా చేసింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్. రాధా కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular