The Subject: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి అభిమానులు అప్ డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ భారీ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇన్నాళ్లు ఆలస్యం అవుతూ వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగష్టు నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ మహేష్ తో చేసేది ఫ్యామిలీ స్టోరీ అంటూ వార్తలు వచ్చాయి. నువ్వు నాకు నచ్చావ్ తరహాలో ఉండే కుటుంబ కథ చిత్రమని టాక్ వినిపించింది. ఆతర్వాత ఫ్యామిలీ స్టోరీ కాదు.. యాక్షన్ మూవీ అని.. ఇప్పటి వరకు మహేష్ చేయని యాక్షన్ ఇందులో చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో త్రివిక్రమ్ మహేష్ తో చేసే సినిమా ఎలా ఉంటుంది అనేది మరింత ఆసక్తిగా మారింది. అయితే.. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
అది ఏంటంటే.. ఇది పొలిటికల్ డ్రామా అని, ప్రస్తుత రాజకీయాల పై త్రివిక్రమ్ ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాను ప్లాన్ చేశాడని తెలుస్తోంది. సినిమాలో చాలా సీన్స్ చాలా ప్రాక్టికల్ గా ఉంటాయట. రాజకీయం ఓ వ్యాపారంగా ఎలా మారంది ?, దీని వల్ల సమాజం ఏం కోల్పోతుంది ? అనే కోణంలో ఈ సినిమా స్క్రిప్ట్ సాగుతుందట. మహేష్ పాత్ర ద్వారా త్రివిక్రమ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ మూవీతో మహేష్, త్రివిక్రమ్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.