Sunday, January 19, 2025
Homeసినిమారూటు మార్చిన మ‌హేష్‌

రూటు మార్చిన మ‌హేష్‌

మ‌హేష్ బాబు…. ‘భ‌ర‌త్ అనే నేను’, ‘మ‌హ‌ర్షి’, ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’, ‘స‌ర్కారు వారి పాట‌‘.. ఇలా వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్స్ సాధిస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. అయితే.. ఈ సినిమాల్లో ఏదో సందేశం ఉంటూనే ఉంది కానీ.. అభిమానులు కోరుకునే ప‌క్కా మాస్ మూవీ చేయ‌క‌పోవ‌డంతో ఎప్ప‌టి నుంచో అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మ‌హేష్ పోకిరి రేంజ్ లో అదిరిపోయే మాస్ క్యారెక్ట‌ర్ చేస్తే.. చూడాల‌ని అభిమానులు ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ సినిమా పక్కా మాస్ స్టోరీతో ఉంటుందని తెలుస్తోంది. దీనితో మ‌హేష్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవ‌ని చెప్ప‌చ్చు.  ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్ లో రిలీజ్ కానుంది.

ఈ ఒక్క సినిమానే కాదు.. త‌ర్వాత జ‌క్క‌న్న‌తో చేసే మూవీ అయితే ఓ రేంజ్ లో ఉంటుందని, ఇది మాస్ యాక్ష‌న్ అడ్వంచ‌ర్స్ మూవీ. ఈ సినిమాని ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు. ఇలా మ‌హేష్ రూటు మార్చి వ‌రుస‌గా యాక్ష‌న్ మూవీస్ చేస్తుండ‌డం విశేషం. ఈ రెండు సినిమాల‌తో మ‌హేష్ చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం అని టాక్ బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.

Also Read: 100 రోజులు పూర్తి చేసుకున్న‌;స‌ర్కారు వారి పాట‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్