Monday, February 24, 2025
HomeTrending Newsమహీంద్రా విద్యార్ధుల జీరో బడ్జెట్ మూవీ

మహీంద్రా విద్యార్ధుల జీరో బడ్జెట్ మూవీ

అసలు ఇంజనీరింగ్ కాలేజ్ కి ఎవరైనా ఎందుకు వెళ్తారు…. చదువుకోడానికా, ఆడుకోడానికా….

ఆ వయస్సులో వారిలో ఉండే భావోద్వేగాలు…. లవ్, ఫ్రెండ్షిప్, అకడమిక్ అంశాల్లో వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి…

అభిప్రాయాలు వ్యక్తం చేసే విషయంలో వారికుండే పరిమితులు ఏమిటి… లాంటి అంశాలపై  జీడిమెట్ల బహదూర్ పల్లి మహీంద్రా ఈకోల్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధులు ఓ షార్ట్ ఫిలిం రూపొందించారు.  ఈ సినిమాకు రచన, దర్శకత్వం, తారాగణం, సంగీతం, ఎడిటింగ్ అంతా ఆ కాలేజ్ విద్యార్ధులే నిర్వహించడం విశేషం.

మాస్టర్ టాకీస్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘కళాశాలలో’ అనే టైటిల్ ఖరారు చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో స్క్రిప్ట్ తో పాటు మిగిలిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని మార్చి నెలల్లో  షూటింగ్ మొదలు పెట్టారు. మొత్తం షూటింగ్ ను తమ కళాశాల ప్రాంగణంలోనే పూర్తి చేయడం మరో విశేషం.

దీనిలో నటించిన వారంతా తొలిసారి కెమెరా ముందుకు వచ్చినవారే…

షార్ట్ ఫిలింలపై మక్కువతో…. భవిష్యత్ ఇంజనీర్లు  రూపొందించిన ఈ చిత్రాన్ని ఆదరిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్