Sunday, January 19, 2025
HomeTrending Newsబండి సంజయ్ నిరాధార ఆరోపణలు - హోంమంత్రి

బండి సంజయ్ నిరాధార ఆరోపణలు – హోంమంత్రి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని హోమ్ శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ప్రకటించారు. దీనికి నిదర్శనం ప్రపంచంలోని పలు బహుళ జాతి కంపెనీలు తమ కార్యాలయాలను, సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, పెట్టుబడులను పెట్టడమేనని హోమ్ శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, నేరాల పై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణల పై స్పందించారు. శాంతి భద్రతలు అదుపులో లేవని బండి సంజయ్ వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. సైబర్ నేరాల అదుపులో, నేరాల నమోదు, నేరస్తులను పట్టుకోవడం, డబ్బును రికవర్ చేయడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని గుర్తు చేశారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సైబర్ నేరాల నియంత్రణ కై ఏర్పాటు చేసిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ( I 4 C ) తో అనుసంధానం చేసి టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మనదన్నారు.

దీనిలో భాగంగానే, ఎక్కడ సైబర్ నేరం జరిగినా, క్షణాలలో నమోదు అవుతున్నాయని వివరించారు. సైబర్ నేరాల బాధితులకు, న్యాయం చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని గుర్తు చేసారు. దేశంలోని మరే రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ పోలీస్ ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మొఘల్ సరాయి లోని సైబర్ నేరస్తుల నుండి తొమ్మిది కోట్ల రూపాయలు రికవరీ చేసిన విషయాన్ని హోమ్ మంత్రి గుర్తు చేశారు. తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణకై చేపట్టిన వినూత్న విధానాలను కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అభినందించి, వీటి వివరాలు కూడా స్వీకరించిందని పేర్కొన్నారు. ఇక, మానవ అక్రమ రవాణా విషయంలోనూ తెలంగాణ పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని గుర్తు చేశారు. వెట్టి చాకిరి నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. వెట్టి చాకిరీ కార్మికులను విముక్తి చేసి సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తున్నామని, ఈ కేసులన్నీ మానవ అక్రమ రవాణా కిందనే నమోదవుతున్నాయని విషయాన్ని బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. శాంతియుత రాష్ట్రాన్ని కల్లోల రాష్ట్రంగా చేయడానికి బండి సంజయ్ తోపాటు ఆయన పార్టీ నాయకులు కుట్ర పన్ను తున్నారని, ఈ కుట్రపూరిత చర్యలను ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని హోమ్ మంత్రి పిలుపునిచ్చారు.

Also Read : కేసీఆర్ పెద్ద గజదొంగ – బండి సంజయ్ ఫైర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్