Sunday, January 19, 2025
HomeTrending Newsరాజస్థాన్లో మజ్లిస్ పార్టీ శాఖ

రాజస్థాన్లో మజ్లిస్ పార్టీ శాఖ

Majlis Party Branch In Rajasthan :

ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల గెలుపు ఓటములు ప్రభావితం చేస్తున్న ఎం.ఐ.ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ  కన్ను ఇప్పుడు రాజస్థాన్ మీద పడింది. రాజస్థాన్లో మజ్లిస్ పార్టీ శాఖ ప్రారంభిస్తామని ఈ రోజు ఒవైసీ జైపూర్ లో ప్రకటించారు. వచ్చే నెల రోజులు, నెలన్నర రోజుల్లో రాజస్థాన్ మజ్లిస్ శాఖ ప్రారంభిస్తామని వెల్లడించారు.  రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోగా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసి కాంగ్రెస్, బిజెపి లకు ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఎత్తేహదుల్ ముస్లిమీన్ సత్తా ఏంటో చూపెడతామన్నారు. అయితే ఎన్ని శాసనసభ స్థానాల్లో పోటీ చేసేది వెల్లడించలేదు.

భారతదేశ చరిత్రను వక్రీకరించే పనిలో బిజెపి నేతలు సిద్దహస్తులని ఒవైసీ విమర్శించారు. ఇందుకు నిదర్శనమే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అని చంద్రగుప్త మౌర్యుడి చేతిలో అలెగ్జాండర్ ఓటమి చవి చూశారని చెపుతున్నారని ఎద్దేవా చేశారు. భారతదేశ విద్యా రంగం, పాఠ్య ఆంశాల్ని సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మౌర్య చక్రవర్తి – అలెగ్జాండర్ వారి జీవితంలో ఎప్పుడు ఎదురు పడని వారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిన యోగి ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు.

Also read : యుపిలో పాగా వేసేందుకు ఎం.ఐ.ఎం కసరత్తు

RELATED ARTICLES

Most Popular

న్యూస్