Saturday, January 18, 2025
HomeTrending Newsమోడీ హయంలో దిగజారిన దేశ ప్రతిష్ట - కెసిఆర్

మోడీ హయంలో దిగజారిన దేశ ప్రతిష్ట – కెసిఆర్

ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులంతా ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని సిఎం కెసిఆర్ పిలుపు ఇచ్చారు. విపక్షాల తరఫున పోటీ చేస్తున్న రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను గెలిపించాలని కోరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా తలపడుతున్న యశ్వంత్ సిన్హా ప్రచారం కోసం ఈ రోజు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో ఏర్పాటు చేసిన తెరాస సమావేశంలో సిఎం కెసిఆర్ పాల్గొని తెరాస మద్దతు సంపూర్ణంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ప్రధాని మీఠీమీఠీ మాటలు చెప్తారు!..తరవాత ఝూఠీఝూఠీ మాటలు మాట్లాడతారని వ్యంగ్యంగా విమర్శించారు. మోడీ తానే బ్రహ్మ అనుకుంటున్నాడు, తానే శాశ్వతం అనుకుంటున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.

15 వ ప్రధాని మోడీ హయాంలో మునుపెన్నడూ లేని విధంగా దేశ ప్రతిష్ట దిగజారిపోయిందన్నారు. ఇందుకు శ్రీలంక ఆరోపణలే ఉదాహరణ అన్నారు. మోడీవి తానాషాహీ విధానాలని, శ్రీలంకలో ఏం జరిగిందని ప్రశ్నించారు. మీరు మీ షావుకార్లకు ఏ మేరకు తినబెడుతున్నారో, ఏఏ దేశాల్లో మీ ఏజెంట్లు ఉన్నారో సమాచారం అంత మా దగ్గర ఉంది. సరైన సమయంలో బైట పెడతామని కేసీఆర్ తెలిపారు.

 

మేక్ ఇన్ ఇండియా ఒక పెద్ద అబద్ధం..అని రేపు స్పష్టత ఇవ్వండని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. సహజవనరుల, మౌలిక సదుపాయాల పరంగా మనకంటే వెనక ఉన్న చైనాలో అభివృద్ధి చూడండని, కెసిఆర్ 16 ట్రిలియన్ల ఎకానమీతో వాళ్ళు దూసుకెళ్తున్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. దేశంలో నీటి వనరుల సద్వినియోగం లేక అనేక ప్రాంతాలు ఒక వైపు వరదలు, మరోవైపు అనావ్రుష్ట్రి తో అల్లాడుతున్నారని కెసిఆర్ విమర్శించారు. మహారాష్ట్ర తరహాలో తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటున్నారు స్థానిక బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు. రండి కూల్చండి. అప్పుడు మేము మరింత స్వేచ్ఛగా కేంద్రంలో మిమ్మల్ని మట్టుబెడతామని కేసీఆర్ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్