Sunday, January 19, 2025
Homeసినిమాచ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ 2024లో వ‌స్తుందా..?

చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ 2024లో వ‌స్తుందా..?

రామ్ చరణ్,  శంకర్ దర్శకత్వంలో  పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ , కైరా అద్వానీ న‌టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సగం మాత్ర‌మే షూటింగ్ పూర్త‌య్యింది. బ్యాలెన్స్ షూట్.. పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ పూర్తి చేసి వచ్చే సంవ‌త్స‌రం వేసవిలో ఈ  చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది దిల్ రాజు ప్లాన్.

శంక‌ర్ ఈ సినిమాని ప‌క్క‌న‌పెట్టి ‘ఇండియ‌న్ 2‘ సినిమాని మ‌ళ్లీ సెట్స్ పైకి తీసుకురావాల్సి వ‌చ్చింది. దీంతో 2023 లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2024 కైనా వ‌స్తుందా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. హైదరాబాద్  టూ చెన్నై చక్కెర్లు కొడుతు శంకర్ రెండు పడవల ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అయితే… ‘ఆర్ సీ 15’ షూట్ లో ప్లాన్ ఛేంజ్ అయినట్లు తాజా సమాచారం. ఇంకా ఈ సినిమాకి సంబంధించి 100 నుంచి 120 రోజులు షూటింగ్ చేయాల్సివుంది.

అటు పై మరో నాలుగైదు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహించాల్సి ఉంది. ఇంత టైట్ షెడ్యూల్ నడుమ శంకర్ సినిమాకి డేట్లు కేటాయించడం ఇబ్బందిగా మారడంతో ‘ఆర్ సీ 15’ తాత్కాలికంగా పక్కనబెట్టేసినట్లు సమాచారం. ఆ కారణంగా సినిమాని వచ్చే సంవ‌త్స‌రం కాకుండా  2024 లోనే రిలీజ్ చేసే కొత్త ఆలోచనతో ఉన్నార‌ట మేక‌ర్స్. శంకర్ ని తొందరపెట్టి ఇబ్బంది పెట్టడం కన్నా కావాల్సినంత సమయం ఇచ్చి ప్రశాంతంగా పూర్తి చేయడమే ఉత్తమం అని చరణ్.. దిల్ రాజు అనుకుని శంకర్ పై ఒత్తిడి తగ్గించినట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. దీంతో 2024లో అయినా ఈ మూవీ వ‌స్తుందా అనేది ఆస‌క్తిగా మారింది.

Also Read: ఇండియ‌న్ 2 రీస్టార్ట్ ?

RELATED ARTICLES

Most Popular

న్యూస్