Sunday, January 19, 2025
Homeసినిమా'భగవంత్ కేసరి' ఫస్ట్ సింగిల్ ఎప్పుడు..?

‘భగవంత్ కేసరి’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు..?

బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ నటిస్తుంటే… కూతరుగా శ్రీలీల నటిస్తుంది. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన తర్వాత వస్తున్న మూవీ కావడంతో భగవంత్ కేసరి సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమా పై మరింతగా అంచనాలు పెంచేసింది. దీంతో భగవంత్ కేసరి ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో సాగే పాటను ఆగష్టు 31న లేదా సెప్టెంబర్ 1న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయట. ఈ పాటలకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ పై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్