Tuesday, April 1, 2025
Homeసినిమామలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ప్రచారకర్తగా ఎన్టీఆర్

మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ప్రచారకర్తగా ఎన్టీఆర్

జువెలరీ రిటైలర్‌ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌.. తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నందమూరి తారక రామారావు ను నియమించుకుంది. ఈ మేరకు ఎన్టీఆర్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. పాన్‌ ఇండియా మాస్‌ సూపర్‌ స్టార్‌గా ఉన్న ఎన్టీఆర్ ప్రచారంతో వినియోగదారులకు మరిం త చేరువయ్యే అవకాశం లభించనుందని మలబార్‌ గోల్డ్‌ వెల్లడించింది.

బ్రాండ్ అంబాసిడర్‌గా జూ.ఎన్టీఆర్ రెండో ఇన్నింగ్స్‌తో మలబార్ గోల్డ్ 30వ వార్షికోత్సవం జరుపుకోనుంది. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, మరోసారి మలబార్ గోల్డ్‌తో భాగస్వామ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్ల సంఖ్యను పెంచుకోవాలనే లక్షంలో భాగంగా సూపర్ స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మలాబార్ గ్రూప్ చైర్మన్ ఎంపి అహ్మద్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్