ఈ ఏడాదిలో చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించబడి .. అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో ‘2018’ ఒకటిగా చెప్పుకోవచ్చు. సాధారణంగా మలయాళ మేకర్స్ కథకి ఎక్కువ ప్రాధాన్యతను .. ఖర్చుకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంటారు. అందువలన వాళ్ల సినిమాల్లో కథనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఖర్చు తక్కువ అనే అంశం వెనుక సహజత్వం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ‘2018’ సినిమా విషయంలోనూ అక్షరాలా వారు అదే పద్ధతిని ఫాలో అయ్యారు.
ఈ సినిమా ఈ నెల మొదటివారంలో మలయాళంలో విడుదలై, మొదటి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటి నుంచి అక్కడ తన జోరును కొనసాగిస్తూ వెళ్లింది. ఆ తరువాత ఈ నెల చివరిలో ఇక్కడ విడుదల చేశారు. మలయాళ ఆర్టిస్టులు ఇక్కడ కొత్త కదా అనుకోవలసిన పని లేదు. ఎందుకంటే ఇది స్టార్స్ చుట్టూ తిరిగే కథ కాదు. కథలో స్టార్స్ కూడా ముఖ్య పాత్రలుగా కనిపిస్తారంతే. కథనే ఈ సినిమాలో హీరో .. వరదల వలన తలెత్తే పరిస్థితులే విలన్.
అలాంటి ఈ సినిమా జూన్ 7వ తేదీన ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనీ లివ్ వారు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ … కన్నడ .. హిందీ వెర్షన్స్ తో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. కేరళ రాష్ట్రంలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, ఎమోషనల్ గా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఆంటోని జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.