Sunday, January 19, 2025
Homeసినిమా‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నా - మలినేని గోపీచంద్

‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నా – మలినేని గోపీచంద్

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్‌, మీనా ప్రధాన పాత్రల్లో కె.అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకం పై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోహెల్‌ మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. తుది దశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి రామజోగయ్యశాస్త్రి రచించగా, రేవంత్‌ ఆలపించిన సెకండ్‌ లిరికల్‌ ‘‘నమ్ముకోరా.. నమ్ముకోరా..’’ సాంగ్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. సి. కల్యాణ్‌ తనయుడు వరుణ్‌ కుమార్‌ అతిథులకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్టేజ్‌ మీదకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపీచంద్‌ మలినేని విచ్చేసి లిరికల్‌ సాంగ్ ను లాంచ్‌ చేశారు. ఈ సాంగ్‌ ‘సరిగమలు’ ద్వారా అందుబాటులో ఉంది.

ఈ సందర్భంగా గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ… కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఒక క్రేజ్‌. ఆయన సినిమాలను నేను నెల్లూరులో చదువుకునే రోజుల్లో రిపీట్‌గా చూసేవాడిని. మా కాలేజీ పక్కనే కృష్ణ, కావేరి, కళ్యాణి థియేటర్స్‌ ఉండేవి. అందులో ఓ వైపు కృష్ణారెడ్డి గారి సినిమా, మరో వైపు ఈవీవీ గారి సినిమాలో పోటా పోటీగా ఆడుతుండేవి. అప్పుడు వీళ్లిద్దరూ స్టార్‌ డైరెక్టర్‌లు. వీళ్లు చూడని హిట్‌లు లేవు. బ్లాక్‌ బస్టర్‌లు కూడా లేవు. దర్శకుల పేరు చూసిన సినిమాకు వెళ్లే ట్రెండ్‌ను సృష్టించిన అతి కొద్ది మందిలో కృష్ణారెడ్డి గారు కూడా ఒకరు. సెన్సార్‌ నుంచి ఇన్ని సినిమాలకు క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందిన ఏకైక దర్శకులు కృష్ణారెడ్డి గారే.

మా బాలయ్య బాబుతో చేసిన ‘టాప్‌ హీరో’ సినిమా పాటల కోసం ఆడియో క్యాసెట్స్‌ అమ్మే షాపుకు సైకిల్‌ మీద వెళ్లి, గంటల తరబడి ఎదురు చూసి మరీ కొన్న విషయం ఎప్పటికీ మర్చిపోలేను. దర్శకత్వం అంటేనే చాలా టెన్షన్‌తో కూడిన క్రియేటివ్‌ వర్క్‌.. అంత టెన్షన్‌తో పాటు మళ్లీ సంగీతం బాధ్యతలు అది కూడా తన ప్రతి సినిమాకూ తానే సంగీతం అందించడం ఒక్క కృష్ణారెడ్డి గారికే చెల్లింది. కోట్ల మంది తెలుగు ప్రేక్షకుల మాదరిగానే నేను కూడా ఈ ఆర్గానిక్‌ మామ`హైటెక్‌ అల్లుడు కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నా. ఇక సి. కల్యాణ్‌ గారి గురించి చెప్పాలంటే ఆయన నాకు అత్యంత ఆప్తులు. నా కెరీర్‌ బిగెనింగ్‌ నుంచి దగ్గరగా చూసిన వ్యక్తి. కోనేరు కల్పన గారు ఈ సినిమాతో పెద్ద హిట్‌ కొట్టబోతున్నారు అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్