Monday, January 20, 2025
HomeTrending Newsమంత్రి హరీష్ తో...మల్లన్నసాగర్ ముంపు బాధితులు

మంత్రి హరీష్ తో…మల్లన్నసాగర్ ముంపు బాధితులు

హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావుతో భేటీ అయిన మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఎర్రవల్లి గ్రామస్తులు. మల్లన్న సాగర్ పూర్తి అయి ఏడాది కావొస్తున్నా R&R కాలనీలో తమకు కేటాయించిన ఇళ్లకు పట్టాలని ఇవ్వలేదని మంత్రికి గుర్తుచేసిన గ్రామస్తులు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన వాళ్లకు పట్టాలు వెంటనే ఇవ్వాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. R&R కాలనీలో కేటాయించిన ఇళ్లలో కనీస సౌకర్యాలైన రోడ్స్, డ్రైనేజీలు, వాటర్, ఎలక్ట్రిసిటీ, విద్యా, వైద్యం కల్పించాలని కోరారు.

ఒంటరి మహిళలకు ఇళ్లు, 18 ఏళ్ళు నిండిన యువతకు ప్రభుత్వం ఇస్తున్న ప్లాట్స్ కేటాయింపు పూర్తి చేయాలని ఎర్రవెల్లి గ్రామస్తులు కోరారు. గ్రామంలో మరికొంతమందికి నష్టపరిహారం అందలేదని…పూర్తిగా అందేలా చూడాలని మంత్రికి లేఖను అందించిన గ్రామస్తులు. గ్రామస్తుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ గ్రామంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్