Sunday, January 19, 2025
Homeసినిమా'ఆహా'లో అడుగుపెడుతున్న 'మళ్లీ పెళ్లి'  

‘ఆహా’లో అడుగుపెడుతున్న ‘మళ్లీ పెళ్లి’  

నరేశ్ – పవిత్ర లోకేష్ ప్రధానమైన పాత్రధారులుగా ‘మళ్లీ పెళ్లి’ సినిమా రూపొందింది. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేశ్ ఈ సినిమాను నిర్మించారు. మే 26వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కొంతమందిలో ఆసక్తిని రేకెత్తించింది. అందుకు కారణం అప్పటి కొన్ని రోజుల క్రితం వరకూ నరేశ్ – పవిత్ర లోకేశ్ వార్తల్లో నానుతూ రావడమే. ఆ విషయం నరేశ్ మూడో పెళ్లికి సంబంధించినది కావడమే.

అయితే పవిత్ర లోకేశ్ తో ఉన్న సాన్నిహిత్యం వలన నరేశ్ తన సినిమాలో నాయికగా ఆమెను తీసుకున్నారా? లేదంటే తమ కథనే సినిమాగా రూపొందిస్తున్నారా? అనేది చాలామందిలో ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడైతే ఈ సినిమా నుంచి ట్రైలర్ వచ్చిందో అప్పుడే అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. సినిమాకి వెళ్లిన వారికి పూర్తి క్లారిటీ వచ్చింది. నరేశ్ తన వ్యక్తిగత జీవితంలో ఇలా జరిగిందంటూ సినిమా ద్వారా చెప్పడానికి ప్రయత్నించడం పట్ల థియేటర్స్ బయట విమర్శలు వినిపించాయి.

సాధారణంగా ఇలాంటి ప్రయత్నాలు థియేటర్స్ నుంచి లాభాలను ఆశించవు. అందువలన ఆ విషయం గురించి మాట్లాడుకోవలసిన అవసరం లేదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పైకి స్ట్రీమింగ్ కి వస్తోంది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ‘ఆహా’వారు అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు. థియేటర్స్ లో ఈ సినిమాను చూసినయారు చాలా తక్కువమంది.  అలాంటి ఈ సినిమా ఈ కంటెంట్ కి ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్