Sunday, April 6, 2025
HomeTrending Newsమార్పునకు నాంది.. మన ఊరు-మన బడి: మంత్రి నిరంజన్‌ రెడ్డి

మార్పునకు నాంది.. మన ఊరు-మన బడి: మంత్రి నిరంజన్‌ రెడ్డి

ప్రభుత్వ ఖర్చులతో ప్రజలకు విద్య, వైద్యం అందించడం రాజ్యాంగ విధి అని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో కూడా దేశంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో విఫలమయ్యామని చెప్పారు. వనపర్తి  జిల్లా ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో మన ఊరు-మన బడి నిధులతో ఆధునీకరించిన మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచి పాఠశాలలు, విద్యాబోధన, వసతులు, మంచి ఆహారం ఉంటే విద్యార్థులు ఉత్సాహంగా చదువుకుంటారని చెప్పారు.

ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ కరువవడంతో తల్లితండ్రులు కష్టపడి తమ పిల్లలను ప్రైవేటుకు పంపిస్తున్నారని తెలిపారు. వారి సంపాదన అంతా విద్య, వైద్యానికి ధారపోస్తున్నారని చెప్పారు. ఆ దుస్థితి నుంచి విముక్తి కల్పిస్తే ప్రజలకు ఖర్చవడంతోపాటు వారి ఆదాయం పెరుగుతుందన్నారు. ఆరోగ్యవంతమైన, జ్ఞానవంతమైన సమాజం నిర్మాణమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. ఇందులోభాగంగా సుధీర్ఘ కసరత్తు అనంతరం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ బడుల మార్పునకు నాందని చెప్పారు. ప్రజలు ఆశించిన విధంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. పాఠశాలల బలోపేతానికి కృషిచేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యాలయాల బలోపేతం ద్వారా కార్పోరేట్ విద్యాసంస్థలకు చెక్‌పెట్టొచ్చని వెల్లడించారు.

Also Read ; గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్‌ ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్