Sunday, January 19, 2025
HomeTrending Newsప్రభుత్వ విద్య బలోపేతానికే మన ఊరు మన బడి

ప్రభుత్వ విద్య బలోపేతానికే మన ఊరు మన బడి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్‌ గారు దూర దృష్టితో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టార‌ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. విద్య, వైద్యం అభివృద్ధికి చేసేందుకు సిఎం కేసిఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం రాంక్యా తండా గ్రామంలోని మండల పరషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో రూ.8.91 లక్షలు, ఖమ్మం కార్పోరేషన్ 9వ డివిజన్ రోటరీనగర్ లోని ప్రాధమిక పాఠ‌శాలలో రూ.13.30లక్షలతో 12రకాల మౌళిక వసతుల కొసం ఆయా పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ , మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.

ఈ స‌ద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..

కార్పొరేట్ పాఠ‌శాల‌ల‌కు దీటుగా ప్రభుత్వ పాఠ‌శాల‌ను తీర్చిదిద్దడమే ల‌క్ష్యంగా సీఎం కేసీఆర్ మ‌న ఊరు మ‌న బ‌డి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించనున్నట్లు తెలిపారు. పాఠ‌శాల‌ల్లో ప్రధానంగా 12 మౌలిక వ‌స‌తులను క‌ల్పించి ప్రభుత్వ విద్యకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేసిఆర్ రూపంలో తెలంగాణ ప్రజలకు ఇది స్వర్ణ యుగం అని, ఏ ఒక్క రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంలో పరిపూర్ణ మార్పు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత ఏడాది సంక్షేమంలో 30 వేల కోట్లు ఉంటే.. ఈసారి 90వేల కోట్ల రూపాయలు కేటాయించారన్నారు.

ప్రజల కష్టాలు తెలిసిన నాయకులు సీఎం అయితే రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటి ఇపుడు మన కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. అందుకే మొదటిసారి 63 సీట్లతో గెలిపిస్తే…రెండోసారి 25 సీట్లను కలిపి 88 సీట్లతో గెలిపించారు. 7280 వేల కోట్ల రూపాయలను మూడు దఫాలుగా ఖర్చు పెట్టి 26వేల పైచిలుకు పాఠశాలలను అభివృద్ధి చేసే గొప్ప కార్యక్రమం మన ఊరు మన బడి అని వివరించారు.

మన ఊరి మన బడితో నూతన శకం మొదలైందని, తర్వాత కేజీ టు పీజీ విద్య కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని చెప్పారు. సిఎం కేసిఆర్ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ కంటే గొప్పగా తీర్చిదిద్దనున్నారని వివారించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో పాఠశాలలను బాగు చేసుకోవడంలో ప్రభుత్వ సాయంతో పాటు పూర్వ విద్యార్థులు, మహిళలు, యువకులు, స్థానిక ధనికులు, గొప్పవారి సహకారం తీసుకోవాలని, బడి బాగు చేసేందుకు అన్ని ప్రయోగాలు చేయాలన్నారు.

Also Read : కార్పోరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : మంత్రి హరిష్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్