Saturday, January 18, 2025
Homeసినిమాక్యూరియాసిటీ పెంచుతున్న 'జిన్నా' ఫస్ట్ లుక్

క్యూరియాసిటీ పెంచుతున్న ‘జిన్నా’ ఫస్ట్ లుక్

విష్ణు మంచు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ నటీనటులుగా డైనమిక్ డైరెక్టర్ ఈషన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాల పై నిర్మిస్తున్న చిత్రం జిన్నా. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని మంచు విష్ణు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.  ఈ ఫస్ట్ లుక్ లో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, చోటా కే నాయుడు కనిపించడం విశేషం.

వైట్ & వైట్ డ్రెస్ లో ఉన్న మంచు విష్ణు లుక్  సినీ అభిమానులలో మరింత క్యూరియాసిటీని క్రియేట్  చేసేలా ఉంది. ఇంతకు ముందు విడుదల చేసిన ప్రీ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఇంతకు ముందు విష్ణు నటించిన రెండు చిత్రాలకు స్క్రిప్ట్‌లు అందించిన కోన వెంకట్ చిత్రానికి కథ – స్క్రీన్‌ప్లే అందించారు. మ‌రి.. స‌రైన స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న విష్ణుకు జిన్నా ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్