Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

శతాబ్ది సినిమాస్ బ్యానర్ పై హీరో కార్తిక్ శివ, హీరోయిన్ సంజనా అన్నే నటించిన చిత్రం ‘నీకు నాకు పెళ్ళంట’. కాసు శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి తాళ్లూరి మణికంఠ దర్శకత్వం వహించారు. ఈ విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ ను హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ “కంటెంట్ బాగున్న సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అదే తరహాలో నీకు నాకు పెళ్ళంట సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ ఇప్పుడే చూశాను చాలా బాగుంది. చిత్ర నిర్మాత కాసు శ్రీనివాస్ రెడ్డి గారికి, డైరెక్టర్ తాళ్లూరి మణికంఠ గారికి హీరో హీరోయిన్ కార్తిక్ శివ, సంజన అన్నే అలాగే ఇతర నటీనటులకు సాంకేతిక నిపుణులకు బెస్ట్ విషెస్” అన్నారు.

శ్యామ్ కార్తిక్, సంజనా అన్నే, ఖయ్యుమ్, వాసు ఇంటూరి, శ్రీ సుధ, ప్రియ పాలువై, దివ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యానర్: శతాబ్ది సినిమాస్, నిర్మాత: కాసు శ్రీనివాస్ రెడ్డి, కెమెరామెన్: ఆదిత్య మణికంఠ, ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి, ఆర్ట్: తాళ్లూరు కృష్ణమోహన్, సంగీతం: రఘు కుంచె, ఎగ్జిక్యూటివ్: చైతన్య, దర్శకత్వం – తాళ్లూరి మణికంఠ.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com