Saturday, January 18, 2025
Homeసినిమాఆదిపురుష్ పై మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆదిపురుష్ పై మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌భాస్ న‌టించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్‌. ఈ చిత్రానికి ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్ పై మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా గ్రాఫిక్స్ స‌రిగాలేవ‌ని.. ఇది బొమ్మ‌ల సినిమాలా ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు మంచు విష్ణు ‘ఆదిపురుష్’ టీజ‌ర్ గురించి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం అయ్యాయి. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… ఆదిపురుష్ టీజర్ చూడగానే మోసం చేసినట్టు అనిపించింది అంటూ మంచు విష్ణు ప్రముఖ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అసంతృప్తిని బహిరంగంగా తెలియ‌చేశారు.

రామాయణం మీద సినిమా అంటే లైవ్ యాక్షన్ మూవీ అనుకున్నామని.. యానిమేషన్ చిత్రం అవుతుందని అనుకోలేదని.. అందుకే నిరాశ చెందామని పేర్కొన్నారు. మేకర్స్ ముందుగా ఇదొక యానిమేటెడ్ మూవీ అని ప్రేక్షకులను ప్రిపేర్ చేసి ఉంచితే బాగుండేదని.. అలా చేస్తే ఎలాంటి ట్రోల్స్ వచ్చేవి కాదని విష్ణు అభిప్రాయపడ్డారు. మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా 21న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

హిందీలో జిన్నా భాయ్ అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆదిపురుష్ టీజర్ పై కొనసాగుతున్న ట్రోలింగ్ గురించి తన ఆలోచనలను షేర్ చేసుకున్నారు. మంచు విష్ణు ఇలా ప్ర‌భాస్ ఆదిపురుష్ మూవీ పై కామెంట్స్ చేయ‌డం సంచ‌ల‌నం అయ్యింది. మ‌రి.. ఆదిపురుష్ మేక‌ర్స్ స్పందిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్