మంచు విష్ణుకి హీరోగాను .. నిర్మాతగాను హిట్ అనేది దొరక్క చాలాకాలమే అయింది. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే గట్టిపట్టుదలతో ఆయన ఉన్నాడు. అలా ఆయన నిర్మించిన సినిమానే ‘జిన్నా‘. మొదటి నుంచి కూడా విష్ణు తనకి అచ్చొచ్చిన యాక్షన్ కామెడీ సినిమాలనే చేస్తూ వచ్చాడు. తనకి హిట్లు ఇచ్చిన జి. నాగేశ్వర రెడ్డి అందించిన కథతో .. కోన వెంకట్ స్క్రీన్ ప్లేతో ఆయన చేసిన సినిమానే ‘జిన్నా’. ఈ సినిమాకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించగా, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. రీసెంట్ గా వదిలిన ‘గోలీ సోడా’ పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సారి విష్ణు యాక్షన్ కామెడీ వైపు మాత్రమే కాకుండా రొమాన్స్ వైపు కూడా కాస్త శ్రద్ధ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఆ ఉద్దేశంతోనే ఆయన సన్నీలియోన్ ను తీసుకున్నాడనే విషయం అర్థమవుతూనే ఉన్నది. ఇక పాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. హాట్ బ్యూటీగా ఆమె ఎంతలా చెలరేగిపోతుందనేది అందరికీ తెలిసిందే. అలాంటి అందగత్తెలతో ‘జిన్నా’ గట్టిగానే సందడి చేయనున్నట్టు రీసెంట్ గా వదిలిన సాంగ్ ను బట్టి స్పష్టమవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కి ఆయన ఈ అంశాలన్నీ జోడించడం విశేషం.
ఈ సినిమాకి ముందు శ్రీను వైట్లతో ‘ఢీ’ సీక్వెల్ చేయవలసి ఉంది. శ్రీను వైట్ల సినిమాలో యాక్షన్ కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందనేది తెలిసిందే. అలాంటి ఆయన ప్రాజెక్టును పక్కన పెట్టేసి మరీ, ముందుగా విష్ణు ఈ సినిమాను చేశాడంటే ఇందులో ఏదో బలమైన పాయింట్ ఉందనే అనుకోవాలి. అదేమిటనేది త్వరలోనే తేలనుంది. సునీల్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను త్వరలోనే థియేటర్లకు తీసుకుని రానున్నారు. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విష్ణు ముచ్చటను ఈ సినిమా తీరుస్తుందేమో చూడాలి.
Also Read: జిన్నా నుంచి గోలీ సోడా వే సాంగ్ రిలీజ్