Tuesday, January 21, 2025
Homeసినిమాసూర్యాపేట లో సినీ నటి రాశీ ఖన్నా సందడి

సూర్యాపేట లో సినీ నటి రాశీ ఖన్నా సందడి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ను బుధవారం రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రారంభించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకలకు ప్రముఖ సినీ నటి రాశి ఖన్నా హాజరై సందడి చేశారు. సినీ నటి రాశి కన్నాను చూడటానికి ఆమె అభిమానులు, పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దపెద్ద నగరాలకు వెళ్లకుండా లేటెస్ట్ డిజైన్ లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

పిఎన్ మూర్తి, పుల్లూరు అరుణ్, కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, వరుణ్ విశాల్ తదితరులు పాల్గొన్నారు. రాశి కన్నా సూర్యపేటకు రావడంతో ఆమెను చూడడానికి అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతామంత జనసంద్రంలా మారింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్