Manipur Polling : మణిపూర్ లో చివరి దశ పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది. మొదటి దశలో వివిధ ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నందున పోలింగ్ భారీ భద్రత మధ్య మొదలైంది. ఈ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. రెండో దశలో 22 నియోజకవర్గాల్లో 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈ రోజు పోలింగ్ లో పలువురు ప్రముఖుల భవితవ్యం తేల్చుకోబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఓ ఇబోబి సింగ్ మరియు మాజీ డిప్యూటీ సిఎం గైఖాంగమ్ గాంగ్‌మీ వారిలో ఉన్నారు. తౌబాల్, చందేల్, ఉఖ్రుల్, సేనాపతి, తమెంగ్‌లాంగ్ మరియు జిరిబామ్ జిల్లాల్లో ఈ దశలో మొత్తం 8.38 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
92 మంది అభ్యర్థుల్లో 17 మందికి నేర చరిత్ర ఉంది. ఈసారి 223 పోలింగ్ కేంద్రాలను మహిళా పోలింగ్ సిబ్బందితో పూర్తిస్థాయిలో నిర్వహిస్హింతున్చనారు. ఫిబ్రవరి 28న జరిగిన మొదటి దశ ఓటింగ్‌లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి .చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పి మరియు ఇంఫాల్ ఈస్ట్ మూడు జిల్లాల్లోని 12 పోలింగ్ స్టేషన్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించారు.
Also Read : యుపి ఐదో దశ ప్రశాంతం