ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు చెందిన పక్కా సమాచారం రావడంతో మల్కన్‌గిరి జిల్లా పోలీసులు, బీఎస్ఎఫ్ బలగాలు కటాఫ్ ఏరియాలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏవోబీలోని మల్కన్‌గిరి జిల్లాలోని జొడొంబో పరిధిలోని కుసుముపుట్టు అటవీప్రాంతంలోని భారీ డంప్‌ను పోలీసులు గుర్తించారు. ఈ డంప్‌లో ఆయుధాలుతో బాటు భారీ పేలుడు సామాగ్రీను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో 303 రకం తుపాకీలు-3, గ్యాస్ గన్‌లు-2,దేశవాళీ తుపాకీలు_4,మందుపాతరలు_2,
గ్రెనెడ్‌లు-2, డిటోనేటర్లు_20 తో పాటు భారీ ఎత్తున పేలుడు సామాగ్రీ, విప్లవ సాహిత్యం, తదితర సామాగ్రీను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు ఏవోబీ ఎస్‌జడ్‌సీ మావోయిస్టు క్యాడర్‌కు చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడు సామాగ్రీ , ఆయుదాలను అమాయక పౌరులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని వారిని హతమార్చడానికి ఈ డంప్‌ను ఉంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.