Monday, January 20, 2025
HomeTrending Newsనీటి పారుదల రంగంలో తెలంగాణ మోడల్ - పంజాబ్ సీఎం

నీటి పారుదల రంగంలో తెలంగాణ మోడల్ – పంజాబ్ సీఎం

తెలంగాణ నీటి పారుదల మోడల్ ను పంజాబ్ లోనూ అమలు చేస్తానని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ పంపు హౌస్ ను ఈ రోజు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా భగవంత్ సింగ్ మాన్ మాట్లాడుతూ, తెలంగాణతో పాటు..పంజాబ్ లో అన్ని రకాల వనరులు ఉన్నాయన్నారు. అక్కడ సాంకేతికతను బాగా సద్వినియోగం చేసుకుంటున్నామని వెల్లడించారు.

తెలంగాణ నీటి పారుదల రంగంలో ఆదర్శంగా ఉంది…దీనిని పంజాబ్ లో కూడా అమలు చేస్తామని.. దేశ వ్యాప్తంగా రైతులు తీవ్ర సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించారు. జంతర్ మంతర్ దగ్గర రైతులు ఆందోళన చేశారని.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు లేదని కేంద్రంపై ఫైర్‌ అయ్యారు. దేశంలో 80 శాతం మంది వ్యవసాయమే చేస్తున్నారని.. పంజాబ్ లో బావులు, బోర్లతోనే పంటలు ఎక్కువగా పండుతాయన్నారు. తెలంగాణలో కాలువల ద్వారా పంటలు పడినట్టు..పంజాబ్ లోను అమలు చేస్తామని ప్రకటించారు భగవంత్ సింగ్ మాన్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్